
ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1. రాష్ట్రంలో పాతజోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2. ఉద్యోగ సంఘాలు కోరినట్లుగా రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకు, 5 శాతం ఓపెన్ క్యాటగిరీలో భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రస్థాయి క్యాడర్ లోని అన్ని పోస్టులను కేవలం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించింది.
3. ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున జీవితభీమా కల్పించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
4. తెలంగాణా రైతు సమన్వయ సమితికి మేనేజింగ్ డైరెక్టర్, సిబ్బంది నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
5. విద్యార్ధుల స్థానికత నిర్ధారణ విషయంలో ఉన్న గందరగోళాన్ని నివారించేందుకుగాను మంచి నిర్ణయం తీసుకుంది. 1వ నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రాంతం అక్కడి స్థానికత వర్తిస్తుంది. లేదా రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో కనీసం నాలుగేళ్ళు చదివిన విద్యార్ధులకు అక్కడి స్థానికత వర్తిస్తుంది.
6. వైద్య ఆరోగ్యశాఖలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల కొరత ఉన్న కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్ళకు పెంచాలానే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
7. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో రూ.550 కోట్లతో నిర్మించతపపెట్టిన ఎత్తిపోతల పధకానికి ఆమోదం తెలిపింది.
8. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పధకం, తుపాకుల గూడెం బరాజ్ ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
9. రూ.3,277 కోట్లతో లింగంపల్లి రిజర్వాయర్
10. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెరిగిన వ్యయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.