రేవంత్ కు అంత తొందర ఎందుకు? కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండలో అయన నివాసం వద్దకు అయన అనుచరులు చేరుకొని హడావుడి చేస్తున్నారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా ఉన్నాను కానీ ఇంతవరకు నాకే దిక్కులేదు. ఇక కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి అప్పుడే ముఖ్యమంత్రి అయిపోదామని కలలుకంటే ఎలా? నాతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి అభ్యర్ధులే. ఇక కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం కోసం పాదయాత్రలకు అనుమతి లభించదని అయన గ్రహిస్తే మంచిది. పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి 2019 ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవడంపై ముందు దృష్టిపెడదాము,” అని అన్నారు.