.jpg)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త పట్టాదారుపాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులను మే 17లోగా పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నప్పటికీ, కొందరు అధికారుల అలసత్వం వలన, కొన్ని ఇతరకారణాల చేత నేటి వరకు ఆ కార్యక్రమం పూర్తవలేదు. ఈ కార్యక్రమంపై సిఎం కెసిఆర్ నిన్న ప్రగతిభవన్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. జూన్ 2నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి వస్తోంది కనుక ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితులలోనూ జూన్ 2లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఏఏ జిల్లాలు, మండలాలలో రైతులకు పాసుపుస్తకాలు, చెక్కులు పంపిణీ అవలేదో తెలుసుకొని తక్షణమే వారికి అందజేయాలని ఆదేశించారు. సిఎం కెసిఆర్ బుధవారం ప్రగతిభవన్ లో దీని గురించి మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యి చర్చించబోతున్నారు.