
మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో మరణించాడు. అతని వయసు కేవలం 21 సం.లు మాత్రమే. మంగళవారం రాత్రి ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు చెప్పడంతో అతనిని హుటాహుటిన ముషీరాబాద్ లోని గురునానక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వైష్ణవ్ అర్దరాత్రి సుమారు 12 గంటల సమయంలో మరణించినట్లు సమాచారం. వైష్ణవ్ చనిపోయాడని తెలిసి దత్తన్నతో సహా కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. అంత చిన్న వయసులో గుండెపోటు రావడం..హటాత్తుగా చనిపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దత్తన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వైష్ణవ్ ఎం.బి.బి.ఎస్. థర్డ్ ఇయర్ లో ఉన్నాడు. ఈ సంగతి తెలుసుకొని భాజపాతో సహా అన్ని పార్టీల నేతలు దత్తన్నను పరామర్శించడానికి వస్తున్నారు. ఈ వయసులో దత్తన్నకు పుత్రశోకం కలగడం నిజంగా చాలా బాధాకరమే.