
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణకు ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరించడంతో రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలు తమకు కూడా వేతన సవరణ అమలుచేయాలని కోరుతూ ఆయా సంస్థల డైరెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తున్నాయి. తెలంగాణా స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎం.ఎ.వజీర్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణల నేతృత్వంలో జెన్-కో, ట్రాన్స్-కో, డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులు గురువారం హైదరాబాద్ విద్యుత్ సౌధా కార్యాలయంలో డైరెక్టర్లను కలిసి వినతి పత్రాలు సమర్పించారు.
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు:
1. 2018, మే 1వ తేదీ నుంచి పి.ఆర్.సి.అమలుచేయాలి.
2. 60 శాతం ఫిట్ మెంట్.
3. 5 శాతం వెయిటేజ్ ఇంక్రిమెంట్లు.
4. ఇపిఎఫ్ నుంచి జిపిఎఫ్ కు మార్చాలి.
5. ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60కు పెంచాలి.
6. వైద్యభీమాపై సీలింగ్ ఎత్తివేయాలి.
7. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న 23,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల అలవెన్సుల బకాయిలు తక్షణమే చెల్లించాలి.
8. ఎన్.పి.డి.సి.ఎల్. ఉద్యోగులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి.