సంబంధిత వార్తలు

తెలంగాణా ప్రభుత్వోద్యోగులకు ఒక శుభవార్త!వారి డిఏను 1.5 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డిఏ జూలై 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది. పించన్ దారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఈ పెంపు వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.350 కోట్లు భారం పడనుందని ఆర్ధికశాఖ లెక్క కట్టింది.