
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఒక శుభవార్త. మియాపూర్, నాగోల్, బేగం పేట, పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ల వద్ద బుధవారం నుంచి ద్విచక్రవాహనాలు అద్దెకు లభిస్తున్నాయి. వీటిని వినియోగించదలచినవారు తమ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లను చూపిస్తే సరిపోతుంది. బైక్ లకు కిలోమీటరుకు రూ.4 చొప్పున అద్దె చెల్లించవలసి ఉంటుంది. వెయిటింగ్, పెట్రోల్ ఛార్జీలు ఉండవు. సాధారణంగా మెట్రో స్టేషన్లకు 5-6 కిమీ దూరంలో ఉండే ఇళ్ళు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, సినిమా ధియేటర్లు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలకు చేరుకోవడానికి ఈ అద్దె బైకులు చాలా అనువుగా ఉంటాయి. కనుక చాలా తక్కువ ఖర్చుతోనే మెట్రో ప్రయాణికులు అక్కడకు చేరుకోవచ్చు. ప్రస్తుతం 60 ద్విచక్రవాహనాలు అద్దెకు లభిస్తున్నాయి. త్వరలో మరో 500 వాహనాలను మిగిలిన అన్ని స్టేషన్లవద్ద కూడా ఏర్పాటు చేస్తామని మెట్రో అధికారులు తెలిపారు.