మంత్రిగారికి పెళ్ళి!

ఏపి పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త భార్గవ్ ను  ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఈరోజు హైదరాబాద్ లో అఖిలప్రియ నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఆగస్ట్ 29న వారి వివాహం జరుగబోతున్నట్లు సమాచారం. అఖిలప్రియ స్వర్గీయ భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల కుమార్తె అని అందరికీ తెలిసిందే. దురదృష్టవశాత్తు ఆమె తల్లి గత ఎన్నికల సమయంలో కారు ప్రమాదంలో చనిపోగా, గత ఏడాదే ఆమె తండ్రి గుండెపోటుతో చనిపోయారు. ఆ తరువాత ఆమెకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో పర్యాటక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.