సంబంధిత వార్తలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో టి-కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రలు మళ్ళీ మే 13న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి మొదలవబోతున్నాయి. ఈ 3వ విడత బస్సు యాత్రలో మొదటి రోజున మంచిర్యాల, 14న చెన్నూరు, 15న సిర్పూరు, 16న ఆసిఫాబాద్, 17న బెల్లంపల్లిలో యాత్ర నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.