సంబంధిత వార్తలు

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు, ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మిస్తున్న సంగతి తెలిసింది. రామంతపూర్ నుంచి అంబర్ పేట వరకు ప్రభుత్వం ఒక ఫ్లై ఓవర్ నిర్మించబోతోంది. దానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ శనివారం శంఖుస్థాపన చేయబోతున్నారు. అలాగే ఉప్పల్ జంక్షన్ వద్ద కూడా నిర్మించబోయే ఫ్లై ఓవర్ కు కూడా నితిన్ గడ్కారీ రేపు శంఖుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని సమాచారం.