క్రికెట్ బుకీతో ఎమ్మెల్యేకు ఏంపని?

ఏపి వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎసిబి అధికారులు ఒక కేసు నమోదు చేశారు. అయన విజయవాడలో ఒక హోటల్ లో క్రికెట్ బుకీ కృష్ణ సింగ్ అనుచరుడితో సమావేశమయ్యి నగదు లావాదేవీలు జరిపినట్లు కనుగొని ఆయనపై కేసు నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఒక కేసును ఎదుర్కొంటున్న కృష్ణ సింగ్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూ.23 లక్షలు తీసుకొన్నట్లు ఎసిబి అధికారులు ఆధారాలు సంపాదించారు. ఏపి ఏసీబి డిజిపి మాలకొండయ్య ఆదేశాల మేరకు ఎసిబి డిజి టాగూర్ ఈ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు తమ నియోజకవర్గం అభివృద్ధికి, అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశించడం సహజం. కానీ ఇటువంటి వ్యవహారాలలో పాల్గొంటూ ఎసిబి చేతికి చిక్కడం చాలా శోచనీయం.