అకున్ సభర్వాల్ బదిలీ!

తెలుగు సినీపరిశ్రమలో మాదకద్రవ్యాలకేసుతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ను రాష్ట్ర పౌరసరఫరాలశాఖకు కమీషనర్ గా బదిలీ అయ్యారు. అయన స్థానంలో సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక ఇంతవరకు పౌరసరఫరాలశాఖకు కమీషనర్ గా చేసిన సిపి ఆనంద్ ను సిఐఎస్ఎఫ్ ఐజిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎటువంటి అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరుగడం లేదు కనుక ఈ బదిలీలు సమయానుసారం సాధారణంగా జరిగినవేనని భావించవచ్చు. 

ఎటువంటి గుర్తింపులేని ఎక్సైజ్ శాఖకే తన పనితీరుతో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన అకున్ సభర్వాల్, ఇప్పుడు పౌరసరఫరాలశాఖలో అక్రమార్కులను కట్టడిచేసి, ఆ వ్యవస్థలో లోపాలను సరిదిద్దగలిగితే, ఆ శాఖద్వారా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, పప్పులు, నూనె తదితర రేషన్ సరుకులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది పేదప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.