కండ్లకోయ ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభించిన కేటిఆర్

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులో భాగంగా ఉన్న కండ్లకోయ ఎక్స్ ప్రెస్ హైవేను మంత్రి కేటిఆర్ మంగళవారం ప్రారంభించారు. మొత్తం 156.9 కిమీ పొడవున నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డులో కండ్లకోయ ఎక్స్ ప్రెస్ హైవే 1.10 కిమీ ఉంది. రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న అనిశ్చిత రాజకీయ పరిస్థితుల కారణంగా కండ్లకోయ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం పూర్తికాలేదు. రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి రాగానే ఈ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి అవరోధంగా ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించడంతో నేటికి ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.  అవుటర్ రింగ్ రోడ్ మొత్తం నిర్మాణానికి జపాన్ కు చెందిన జైకా సంస్థ రూ.6,696 కోట్లు నిధులు అందించింది. దానిలో ఈ కండ్లకోయ ఎక్స్ ప్రెస్ హైవేకు రూ.125 కోట్లు ఖర్చయింది. 8 లేన్లతో నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ హైవేలో 2 ఎంట్రీ, 2 ఎగ్జిట్ ర్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. మంత్రి కేటిఆర్ కండ్లకోయ ఎక్స్ ప్రెస్ హైవే, టోల్ గేట్స్, దాని కార్యాలయ భవనాన్ని కూడా ఈరోజు ప్రారంభించారు.