చంద్రబాబు నాకు మంచి మిత్రుడు: కెసిఆర్

 అవును ఈ మాట అన్నది తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆరే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును ఆ బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడని గట్టిగా చెప్పిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆరే ఈ మాట అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి డిఎంకె నేతలతో చర్చించేందుకు ఆదివారం చెన్నై వెళ్ళిన ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక విలేఖరి “మీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఏపి సిఎం చంద్రబాబు నాయుడును కూడా కలుస్తారా?” అని ప్రశ్నించినప్పుడు “వైకాపా నాటి. చంద్రబాబు నాయుడు నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం చాలా కాలం కలిసి పనిచేశాం. ఫెడరల్ ఫ్రంట్ గురించి అయనతో కూడా చర్చలు జరుగుతున్నాయి. మాతో కలిసివచ్చేవారిని అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాము,” అని అన్నారు.