కోమటిరెడ్డి కేసులో వారిరువురికీ హైకోర్టు జరిమానా

గత అసెంబ్లీ ఎన్నికలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయిన దుబ్బాక నర్సింహారెడ్డి (తెరాస), కంచర్ల భూపాల్ రెడ్డి (ఇండిపెండెంట్) ఇద్దరూ మరోసారి కోమటిరెడ్డి చేతిలో హైకోర్టులో కూడా ఓడిపోయారు. గత ఎన్నికలలో ఎన్నికల అధికారికి సమర్పించిన నామినేషన్ పత్రాలలో అయన తన విద్యార్హతలకు సంబందించి తప్పుడు సమాచారం ఇచ్చారని, కనుక అయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ వారిరువురూ వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. కానీ తమ వాదనలు నిజమని వారు నిరూపించలేకపోవడంతో హైకోర్టు వారి పిటిషన్లను కొట్టివేసింది. విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు వారిరువురికీ చెరో రూ.25,000 జరిమానాలు విధిస్తున్నట్లు ఈ కేసును విచారించిన జస్టిస్ రామలింగేశ్వర రావు శుక్రవారం తీర్పు చెప్పారు.