పోలీస్ శాఖలో 18,000 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

 తెలంగాణా రాష్ట్ర  పోలీస్ శాఖలో ఒకేసారి ఏకంగా 18,000 పోస్టుల భర్తీకి అతిత్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. పోలీస్ శాఖలో గల సివిల్, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌, కమ్యూనికేషన్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో మొదలైన విభాగాలలో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయి వరకు ఉండే పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వచ్చేవారంలోగా నోటిఫికేషన్ వెలువడబోతున్నట్లు తాజా సమాచారం.