
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం హైదరాబాద్ పర్యటనకు వస్తునందున నగరంలో కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తెలియజేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు, సమయాలు:
బంజారాహిల్స్ రోడ్ నెం.12, మోర్ మెడికల్స్, ఎసిబి ఆఫీస్, వెంగళరావు బస్టాప్, సి.ఆర్.పి.ఎఫ్ క్యాంప్, ఖాజా మేన్షన్, మాసాబ్ ట్యాంక్, ఎన్.ఎం.డి.సి, పివిఎన్. ఎక్స్ ప్రెస్ హైవే వరకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు.
మళ్ళీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఒంటి గంట వరకు బంజారాహిల్స్ రోడ్ నెం.12, వెంగళరావు బస్టాప్, ఏసిబి ఆఫీస్, ఖాజా మేన్షన్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, పివిఎన్. ఎక్స్ ప్రెస్ హైవే వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మంగళవారం ఉదయం 7.45గంటల నుంచి 9గంటల వరకు, బంజారాహిల్స్ రోడ్ నెం.12, మోర్ మెడికల్స్, ఎసిబి ఆఫీస్, ఖాజా మేన్షన్, మాసాబ్ ట్యాంక్, నుంచ పివిఎన్.ఎక్స్ ప్రెస్ హైవే వరకు ఆంక్షలు ఉంటాయని అంజనీ కుమార్ తెలిపారు.