నా వల్ల కాదు బాబు: కేటిఆర్

తన రాజకీయ ప్రత్యర్ధులపై తన మాటలతో నిప్పుల వర్షం కురిపించే మంత్రి కేటిఆర్, అప్పుడప్పుడు మంచి కామెడీ కూడా పండిస్తుంటారు. తెలంగాణాలోనే కాక ఇరుగుపొరుగు రాష్ట్రాలలో కూడా ఎవరైనా అయన సహాయం అర్ధిస్తూ ట్విట్టర్ లో చిన్న మెసేజ్ పెడితే, వీలైతే తప్పకుండా వారికి తన శక్తిమేర సహాయపడుతుంటారని అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవ్వాళ్ళ ఒక వ్యక్తి అయన సహాయం కోరాడు. దానికి కేటిఆర్ ఇచ్చిన సమాధానం చూసి అందరూ నవ్వుకోకుండా ఉండలేరు. 

‘హైదరాబాద్ లో జరుగబోయే ఐపిఎల్ మ్యాచ్ లు చూసేందుకు ఫ్రీగా మూడు టికెట్లు ఇప్పించగలరా సార్?’ అని ఒక వ్యక్తి ట్వీట్ చేయగా “నా వల్ల కాదు బాబు’ అనే చిన్న మెసేజ్ దాని పక్కనే రెండు చేతులతో దణ్ణం పెడుతున్న బొమ్మను కేటిఆర్ పోస్ట్ చేశారు. అది చూసి అందరూ నవ్వుకొంటున్నారు. మీరూ అది చూసి ఆనందించండి.