తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించిన ఆయన ఆసక్తికర ఆరోపణలు చేశారు. బ్రిటిష్ వాళ్లే తన సలహాలు తీసుకుంటే… ప్రస్తుత కేసీఆర్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా తమ సూచనలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల విభజన రాజకీయ అవసరాల కోణంలోనే జరుగుతోందని ఆయన తెలిపారు. బయ్యారం గనులను దక్కించుకునేందుకు… బయ్యారం, గార్ల ప్రాంతాలను మహబూబాబాద్ లో కలిపేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. జిల్లాల విభజనలో తమ మాట పట్టించుకోవడం లేదంటున్నారు. బ్రిటిష్ హైకమిషనర్ నిన్న హైదరాబాదులో పర్యటించిన నేపథ్యంలోనే జానారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే.. బ్రిటీషోళ్లకు జానారెడ్డి ఏ సలహా ఇచ్చారన్నది మాత్రం చెప్పడం లేదు.
తాజాగా జానారెడ్డి కేసీఆర్ సర్కార్ కు సవాల్ విసిరారు. ఒకవేళ తన సవాల్ ను తెలంగాణ సర్కార్ స్వీకరించి తనను ఓడిస్తే.. తాను రాజకీయాలు వదిలిపెట్టిపోతానని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని జానారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలోని ప్రాజెక్టులు ఒక పంటకు నీరు ఇచ్చేందుకు డిజైన్ చేసినవని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండు పంటలకు నీరు ఇస్తే తాను టీఆర్‌ఎస్‌లో ప్రచార కార్యకర్తగా పని చేస్తానని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దీని మీద రాజకీయ సర్కిల్స్ లో డిఫరెంట్ కామెంట్లు వినిపిస్తున్నాయి. జానారెడ్డిలాంటి వాళ్లు రాజకీయాల నుండి తప్పుకుంటే కామెడీ ఎవరు చేస్తారని కొంతమంది, జానారెడ్డి రాజకీయాల్లో ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.