ఇక ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు

రాష్ట్రంలోని రేషన్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక ఏ జిల్లాలో రేషన్ కార్డు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా రేషన్ సరుకులు పొందవచ్చు. ఇప్పటి వరకు ఈ వెసులుబాటు జిల్లా వరకు మాత్రమే ఉండేది దానిని రాష్ట్రమంతటికీ విస్తరించడంతో నిరుపేద ప్రజలు ఆటోలు, బస్సులు పట్టుకొని ఎక్కడో ఉన్న తమ రేషన్ షాపుకు వెళ్ళనవసరం లేకుండా తమకు సమీపంలో ఉన్న రేషన్ షాపు నుంచి సరుకులు తెచ్చుకోగలుగుతారు.