టికెట్లు కాదు..విమాన సంస్థే అమ్మకం!

దేశంలో ప్రైవేట్ విమానయాన సంస్థలు పోటాపోటీగా నామమాత్రపు ధరలకే టికెట్స్ అమ్ముతుంటే, కేంద్రప్రభుత్వం ఎయిర్ ఇండియా సంస్థనే అమ్మేసి వదిలించుకోవాలని నిర్ణయించడం విశేషం. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ, చాలా ప్రభుత్వరంగ సంస్థలలాగే అసమర్ధత, అలసత్వం, ప్రణాళికాలోపాలు, తరచూ ఉద్యోగుల సమ్మెలు వంటి కారణాల చేత ఎయిర్ ఇండియా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. వాటిని వదిలించుకొనేందుకు దానిలో 76 శాతం వాటాను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడానికి ఇండిగో, ఎయిర్ ఫ్రాన్స్, జెట్ ఎయిర్ వేస్, డెల్టా ఎయిర్ వేస్ ఆసక్తి చూపుతున్నాయి.