సమైక్య రాష్ట్రంలో సిబిఐ జాయింట్ డైరెక్టరుగా పని చేసిన లక్ష్మి నారాయణ స్వచ్చందంగా పదవీ విరమణ కోరుతూ దరఖాస్తు చేసుకొన్నారు. అయన కర్నూలుకు చెందినవారైనప్పటికీ 1990లో మహరాష్ట్ర క్యాడర్ లో ఐపిఎస్ అధికారిగా ఎంపికయిన కారణంగా ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఆయన కేంద్ర సర్వీసులో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రానికి సిబిఐ జాయింట్ డైరెక్టరుగా రెండేళ్ళ పాటు సేవలు అందించారు. ఆ సమయంలో అయన జగన్ అక్రమాస్తుల కేసులపై చాలా లోతుగా దర్యాప్తు జరిపి జగన్, విజయసాయి రెడ్డి తదితరులపై సిబిఐ కోర్టులో ఏకంగా 10 ఛార్జి షీట్స్ దాఖలు చేశారు.
ఆ తరువాత, అయన మళ్ళీ బదిలీపై మహారాష్ట్రకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయన ఆ రాష్ట్రంలో అడిషనల్ డిజిపిగా పనిచేస్తున్నారు. కనుక స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ ఆ రాష్ట్ర డిజిపికి దరఖాస్తు చేస్తుకొన్నారు. అయితే అయన ఇంత హటాత్తుగా ఎందుకు రాజీనామా చేస్తున్నారనే దానిపై కారణాలు తెలియకపోవడంతో అయన ఏపిలో ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికే రాజీనామా చేశారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అయన సిబిఐలో పనిచేసి అనేక కేసులను దర్యాప్తు చేసినప్పటికీ, రాజకీయాల కంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపేవారు. కనుక ఆయన రాజకీయాలలోకి రాకపోవచ్చు.