బస్సు, విద్యుత్ ఛార్జీల బాదుడు సిద్ధం

తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ రంగ సంస్థల బాగుపడితే అంతిమంగా వాటి ఫలితాలు ప్రజలకే చేరుతాయన్నారు. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ  తదీతరులు పాల్గొన్నారు. ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడడానికి సామాన్యులపై భారం పడకుండా బస్సు ఛార్జీలు పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

కాగా మరోపక్క కేసీఆర్ సర్కార్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన అంశం నిరంతర విద్యుత్. ఛత్తీస్‌ఘడ్ నుండి కరెంట్ తీసుకొని మరీ మనకు కోతలు లేకుండా విద్యుత్ ను అందించారు ముఖ్యమంత్రి. కానీ త్వరలోనే విద్యుత్ బాదుడు కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఎంత మేర విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి అన్నదాని మీద ప్రస్తుతానికి క్లారిటీ లేకున్నా కూడా విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి అన్నది మాత్రం వాస్తవం. మొత్తానికి కేసీఆర్ సర్కార్ ఇప్పుడు బాదుడుకు సిద్దమైంది.