ఏపి బడ్జెట్ హైలైట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో 2018-19 సం.లకు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ హైలైట్స్: 

 మొత్తం బడ్జెట్‌ రూ.లక్షా 91 వేల 63 కోట్లు

రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు

మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు

ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు

సాగునీటి రంగానికి రూ.16,978కోట్లు, పోలవరానికి రూ.9,000 కోట్లు, వ్యవసాయానికి రూ.12, 355 కోట్లు, విద్యుత్‌ రంగానికి రూ.5,052 కోట్లు, పరిశ్రమలకు రూ.3,078 కోట్లు, రవాణా రంగానికి రూ.4, 653 కోట్లు, పర్యావరణ రంగానికి రూ.4, 899 కోట్లు, రవాణా మరియు రోడ్డు భవనాల శాఖకు రూ.4,653కోట్లు, రోడ్ల అభివృద్ధికి రూ.1,413 కోట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు రూ.300కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.7,740కోట్లు, గృహనిర్మాణానికి రూ.3,679కోట్లు, మున్సిపల్‌ శాఖకు రూ.7,761కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. 

రాష్ట్ర బడ్జెట్ చాలా ఘనంగానే ఉంది కానీ కేంద్రంతో తెగతెంపులు చేసుకొని అన్ని నిధులు ఎక్కడి నుంచి ఏవిధంగా సమకూర్చుకొంటుందో చూడాలి.