సంబంధిత వార్తలు
మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మొదలవబోతున్నాయి. యధాప్రకారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించిన తరువాత సభ మరుసతిరోజుకు వాయిదా పడుతుంది. మార్చి 13న శాసనసభ, మండలి వ్యవహారాల సలహా సంఘం (బిఏసి) సమావేశమయ్యి, ఉభయసభల షెడ్యూల్, అజెండా మొదలైనవన్నీ చర్చించి ఖరారు చేస్తారు. 2018-19 రాష్ట్ర బడ్జెట్ ను మార్చి 15న ఉభయసభలలో ఒకేసారి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.