ఈశాన్యంలో భాజపా పాగా

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో భాజపా తిరుగులేని ఆధిక్యతతో విజయపధంలో దూసుకుపోతోంది. త్రిపురలోని మొత్తం 60 స్థానాలకు 40 స్థానాలలో ఆధిక్యతతో భాజపా సాగుతోంది. ఇక నాగాలాండ్ లో కూడా 60 స్థానాలకు 32 స్థానాలలో ఆధిక్యతతో భాజపా దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లు అవసరం. భాజపా అంతకంటే ఎక్కువ సీట్లే గెలుచుకోబోతోందని స్పష్టం అయ్యింది. దీంతో త్రిపురలో రెండున్నర దశాబ్దాల సిపిఎం పాలన ముగిసిపోయింది.

త్రిపురలో (60 స్థానాలు): భాజపా:43, కాంగ్రెస్:0, సిపిఎం:16, ఇతరులు: 0 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.

నాగాలాండ్ లో (60 స్థానాలు): భాజపా:32, కాంగ్రెస్: 0, ఎన్.పి.ఎఫ్:24, ఇతరులు: 4 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.

ఇక మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించినప్పటికీ, కేవలం 7 స్థానాలలో ఆధిక్యతలో సాగుతున్న భాజపా, ఎస్.పి.పి., ఇతరులను కలుపుకొని ఆ రాష్ట్రంలో కూడా అధికారం చేజిక్కించుకోవడానికి అప్పుడే పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మేఘాలయలో (60 స్థానాలు): కాంగ్రెస్: 26, భాజపా: 07, ఎన్.పి.పి: 12, ఇతరులు: 13 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.