నాన్నగారు ఆవేదనతో అలా అన్నారు: కవిత

ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి ముఖ్యమంత్రి కెసిఆర్ అనుచితంగా మాట్లాడటంపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ మంత్రి కేటిఆర్ ను సంజాయిషీ కోరడం, తన తండ్రి ఆవిధంగా మాట్లాడినందుకు అయన విచారం వ్యక్తం చేయడం, అయన విచారం వ్యక్తం చేశారు గనుకనే తాను ఆదిభట్లలో జరిగిన అధికారిక కార్యక్రమానికి హాజరయ్యానని నిర్మలా సీతారామన్ చెప్పడం, ఈ వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడం జరిగాయి. వాటిపై తెరాస ఎంపి కవిత కూడా స్పందించారు. “దేశ ప్రధాని పట్ల అనుచితంగా మాట్లాడి అవమానించాలానే సంకుచిత గుణం తెరాస నేతలకు లేదు. రైతు సమస్యల పట్ల తీవ్ర ఆవేధన చెందిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఏదో ఫ్లోలో అలా మాట్లాడారు తప్ప ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కావు. భాజపా నేతలు వాటిని పట్టుకొని ఇంతగా సాగదీసి రాద్దాంతం చేయడం సరికాదు,” అని అన్నారు. 

అయితే కెసిఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీని అవమానించాలనే ఉద్దేశ్యం లేదనేది వాస్తవం కానీ ఏదో ఫ్లోలో...లేదా పొరపాటున అన్న మాటలు కావని అందరికీ తెలుసు. దేశంలో రైతుల సమస్యలను కేంద్రప్రభుత్వం అర్ధం చేసుకోకుండా, తెలివితక్కువగా వ్యవహరిస్తోందని అన్నారు. సుమారు 75,000 క్యూసెక్కుల నీళ్ళు దేశంలో ప్రవహిస్తుంటే వాటిలో పావు వంతు కూడా వినియోగించుకోలేకపోతున్నామని అన్నారు. కానీ కర్ణాటకలో ఎన్నికలు రాబోతున్నందున మోడీ నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, భాజపాలపై కెసిఆర్ ఇంకా చాలా విమర్శలు చేశారు. అందుకే ఆ రెండు పార్టీల నేతలు కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. కనుక కెసిఆర్ ఏ ఉద్దేశ్యంతో ఆ మాటలు అన్నా అవి సరికాదు కనుక ఇప్పుడు ఎవరూ భాజపా నేతలు తప్పు పట్టడం కూడా సరికాదనే చెప్పాలి.