సంబంధిత వార్తలు
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పోర్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ప్రధాన పోస్టాఫీస్ లో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న ఎంపి నగేష్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కేంద్రం వలన అదిలాబాద్, నిర్మల్, కుమ్రుం భీమ్, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు వెసులుబాటు లభిస్తుంది.