రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హోలీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో రేపు సిక్కు మతస్తుల ఊరేగింపు కార్యక్రమాలు సాగే ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర జాయింట్ కమీషనర్ రవీందర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఊరేగింపు జరిగే మార్గాలలో ట్రాఫిక్ ను ఇతర మార్గాలలోకి మళ్ళిస్తున్నట్లు తెలిపారు.  

ఊరేగింపు జరిగే ప్రాంతాలు: గురుద్వారా, గౌలిగూడ, శంకర్ షేర్ హోటల్, మహబూబ్ గంజ్, సిద్ధి అంబర్ బజార్ మసీదు, బేగంబజార్ ఛత్రి, జుమెరాత్ బజార్, పురానాపూల్, బహదూర్ పురా పోలీస్ స్టేషన్, బహదూర్ పురా క్రాస్ రోడ్స్ మీదుగా కిషన్ బాగ్ వరకు. ఈ మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి కనుక ప్రజలు వేరే మార్గాల ద్వారా ప్రయాణించా జాయింట్ కమీషనర్ రవీందర్ విజ్ఞప్తి చేశారు.