శ్రీదేవి కడసారి దర్శనానికి తరలివస్తున్న ప్రముఖులు

ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం ముంబాయిలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచారు. దేశంలో ఉత్తర, దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు ఆమెను కడసారి చూసి నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. జయప్రద, హేమమాలినీ, మాధూరీ దీక్షిత్, సుస్మితాసేన్, టబూ, సారా ఆలీఖాన్, సుబాష్ ఘాయ్, చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్, అనిల్ కపూర్, ఐశ్వర్యా బచ్చన్, అక్షయ్ ఖన్నా తదితర అనేకమంది ప్రముఖులు వచ్చి ఆమెకు నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి శాస్త్రోక్తంగా జరుగవలసిన అంత్యక్రియల కార్యక్రమాలు మొదలవుతాయి. తరువాత మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 3.30-4.00 గంటలకు విల్లేపార్లేలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.