శ్రీదేవి భౌతికకాయానికి పోస్ట్ మార్టం పూర్తి

మొన్న శనివారం రాత్రి దుబాయ్ లో ఒక వివాహకార్యక్రమానికి హాజరైనప్పుడు హటాత్తుగా గుండెపోటుతో మరణించిన  ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయానికి ఈరోజు ఉదయం పోస్ట్ మార్టం పూర్తయింది. తదనంతర ప్రక్రియ పూర్తవగానే ఆమె భౌతిక కాయాన్ని ప్రత్యేకవిమానంలో ముంబాయి తీసుకువస్తారు. ఆమె భౌతిక కాయాన్ని ముంబై తీసుకువచ్చేందుకు  ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంభానీ తన ప్రైవేట్ జెట్ ప్లేన్ ను దుబాయి పంపించినట్లు తాజా సమాచారం. మరొక రెండు, మూడు గంటలలో శ్రీదేవి భౌతికకాయాన్ని వెంటబెట్టుకొని ఆమె భర్త బోనీకపూర్, కుమార్తె ఖుషి మరికొందరు బంధుమిత్రులు ప్రత్యేకవిమానంలో ముంబై చేరుకొంటారు. నాలుగు దశాబ్దాలపాటు ఉత్తర,దక్షిణాది హిందీ సినీపరిశ్రమలను ఏలిన శ్రీదేవిని చివరిసారిగా చూసేందుకు ఆమె అభిమానులు అంధేరీలోని ఆమె నివాసం వద్దకు బారీ సంఖ్యలో చేరుకొంటున్నారు. ఈరోజు సాయంత్రంలోగా ముంబైలోని శాంతాక్రజ్ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరిపించడానికి వారి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.