సంబంధిత వార్తలు

హైదరాబాద్ అంబర్ పేట మురుగునీటిలో పోలియో వైరస్ గుర్తించిన దగ్గరినుండి, ఆ వ్యాధిని సమూలంగా నిర్మూలించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈరోజు నుండి వారం రోజుల పాటు (26 వరకు) పోలియో నిర్మూలన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా 12 ప్రాంతాల్లోని ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ఇంజెక్షన్ రూపంలో అధికారులు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
బస్తీలలో, మురికి వాడల్లోని కుటుంబాలకు, పోలియో కి సంబంధించిన అవగాహన కలిగించే దిశగా కూడా ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. అన్ని కేంద్రాలలో చిన్న పిల్లలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు.