ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అనాల్సిన మాటలు కావవి అంటూ, కాంగ్రెస్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు మిగతా వారు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కెసిఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి విజయశాంతి ఆరోపించారు.
"నా సొంత లాభం కోసం నేను టీఆర్ఎస్ విడిచి కాంగ్రెస్ లో చేరానని కెసిఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను 2013 జూన్ లో సస్పెండ్ చేసిన ఎనిమిది నెలల తర్వాత గాని నేను కాంగ్రెస్ లో చేరలేదు. ఈ విషయం తెలియకుండా అర్ధం లేని ఆరోపణలు చేయడం సరికాదు" అని విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరిన సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. చాలా కాలం తర్వాత విజయశాంతి కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఎటువంటి మలుపులు తీసుకుంటుందోనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.