హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ ను స్మార్ట్ సిటీ పథకం కింద అభివృద్ధి చేయవలసిందిగా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి స్పందిస్తూ మోడీ ప్రభుత్వం కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసుకుంది.
హైదరాబాద్ ఇప్పటికే అభివృద్ధి చెందడంతో కేంద్రం అభివృద్ధి చేయవలసింది పెద్దగా లేకపోవడంతో, కరీంనగర్ ను కెసిఆర్ సూచించారు. అయితే ఎన్నో పరిశీలనలు చేసి స్మార్ట్ సిటీలను ఎంపిక చేశాం అని కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపినా కూడా కెసిఆర్ చెప్పిన వెంటనే ఇలా మార్పులు చేయడంతో మోడీకి, కెసిఆర్ కి మధ్య ఉన్న అనుబంధం ఎంటో అర్ధం చేసుకోవచ్చని, ఈ అనుబంధం ముందు రోజుల్లో రాజకీయంగా కూడా బలపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న మార్పును టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మీడియా లో ప్రకటించారు.