కాంగ్రెస్ కు తగిన శాస్తి జరిగింది, ఇక బీజెపీ వంతు- రేవంత్ రెడ్డి

గతంలో టీడీపీ నుండి టీఆర్ఎస్ కు నాయకులు వరసబెట్టి వలస పోతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై యుద్ధం ప్రకటించడానికి తోడుగా రమ్మంటే కాంగ్రెస్ రాలేదు. ఇప్పుడు మా గతే కాంగ్రెస్ కి కూడా పుట్టింది, తగిన శాస్తి జరిగింది అంటూ టీటీడీపీ లీడర్ రేవంత్ రెడ్డి అన్నారు. 

గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు, మరి కొంత మంది ఇతర పార్టీ నాయకులు, నిన్న టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ తర్వాత వరసలో ఉంది బీజెపీనే అని, ఇప్పటికైన అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ కి పట్టిన గతే బీజెపీ కి కూడా పట్టడం తప్పదని, రేవంత్ రెడ్డి తెలిపారు. 

కెసిఆర్ కు ఆజన్మ శత్రువుగా పేరు ఘడించిన రేవంత్ రెడ్డి, ఈ సారి మాత్రం, ముఖ్యమంత్రికి సపోర్ట్ గానే మాట్లాడుతున్నట్లుగా ఉందని, విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ లో తన ప్రాముఖ్యత తగ్గిపోతోందనుకున్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, తన లోని ఫైర్ ఈ విధంగా తగ్గించుకుంటున్నారేమో.