మహేష్ కత్తి..లేదా కత్తి మహేష్ పేరు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ బిగ్ బాస్-1 రియాల్టీ షో పుణ్యామాని ఇప్పుడు అందరూ ఆయనను గుర్తు పడుతున్నారు. బిగ్ బాస్ షో వలన లభించిన పాపులారిటీని మిగిలినవారు తమ సినీ కెరీర్ ను మళ్ళీ గాడిన పెట్టుకోవడానికి వినియోగించుకొంటుంటే మహేష్ మాత్రం దానిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కయ్యానికి కాలు దువ్వడానికి ఉపయోగించుకొంటుండటం విశేషం. తద్వారా జనాల దృష్టిని బాగానే ఆకర్షించగలుగుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టిలో నిజ జీవితంలో విలన్ గా మారిపోయారు. అయినప్పటికీ మహేష్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పవన్ కళ్యాణ్ కత్తి తిప్పుతూనే ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మహేష్ మళ్ళీ మరోసారి పవన్ కళ్యాణ్ పై కత్తి తిప్పారు. ఆయన ఫేస్ బుక్ లో ఏమి వ్రాశారో మీరే చదవండి.
“పవన్ కళ్యాణ్ పిచ్చి సేన బూతుల్ని ఖండించే ధైర్యం లేని వాళ్ళు, నాకు నీతులు చెప్పడంలో మట్టుకు ముందు ఉంటారు. నా గోల నాది. నా బాధ నాది. నా పోరాటం నాది. మిమ్మల్ని పట్టించుకొమ్మని నేను అనడం లేదు. నాకు మద్దతు కావాలని నేను కోరడం లేదు. నా వైఖరి మీకు చిరాకుని కలిగిస్తే నన్ను బ్లాక్ చెయ్యండి. అయిపోతుంది. నేను ఫోటో పెట్టినా, ఒక వీడియో యూట్యూబ్ లో పెట్టినా, రివ్యూ చెప్పినా ఎక్కడ పడితే అక్కడ నన్ను అమ్మానా బూతులు తిడుతూ, కొడతాము, చంపేస్తాము అని పబ్లిక్ గా బెదిరిస్తుంటే పవన్ కళ్యాణ్ అనే ఒక బాధ్యతారహిత వ్యక్తి, నటుడు, సోకాల్డ్ నాయకుడు ఇంతవరకు ఒక ఖండన కూడా చేయలేదు. అలాంటి మనిషికి బాధ్యత నేర్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఒక అల్లరి మూకతో అలుపెరగని పోరాటం చేస్తున్నాను. ఒక రాజకీయ జోకర్ ని బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను. మీ సుఖాలలో, సంతోషాలతో, ఆనందాలలో మీరు ఉండండి. నా పోరాటాలలో నేను వుంటాను. I am a fighter and will fight and I don't need anyone. నాతో ఉన్నవాళ్లు నాతో వుంటారు. పోయేవాళ్ళు దయచేసి వెళ్లిపొండి. నా ఫేస్ బుక్ వాల్ నుంచి. నా జీవితం నుంచీ. సింపుల్. ఇదే నా కొత్త సంవత్సరపు నిర్ణయం. నా ఆత్మగౌరవాన్ని మించింది ఏదీ లేదు. నా ప్రాణంతో సహా!"