దేశవ్యాప్తంగా పలు నగరాలలో హైఅలర్ట్

ఇరాన్‌ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమైనీని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు మట్టుపెట్టడంతో హైదరాబాద్‌లోని ముస్లింలు ముఖ్యంగా షియాలు ఆ ఇరు దేశాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు నగరంలో కొన్ని ప్రాంతాలలో నిరసనలు కూడా తెలిపారు. ఈ నేపధ్యంలో పోలీస్ శాఖ ముందస్తు  జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సిలేట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మొహరించి భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలో ఢిల్లీతో సహా ఇతర ప్రాంతాలలో పోలీసులను హై అలర్ట్ చేశారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ మరికొద్ది సేపటిలో ఢిల్లీ చేరుకుంటారు.     రాత్రి 9.30 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో జాతీయ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమై దేశంలో పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకోబోతోంది.