హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో 20 మందికి కరోనా

August 01, 2022
img

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కరోనా మహమ్మారి చాపకింద నీరులా మెల్లగా వ్యాపిస్తోంది. సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్‌లో మైనార్టీ బాలికల గుకుల పాఠశాలలో సోమవారం కొంతమంది విద్యార్ధినులకు కరోనా లక్షణాలునట్లు అనుమానం కలగడంతో ఉపాధ్యాయులు వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి కరోనా పరీక్షలు చేయించగా వారిలో నలుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య సిబ్బంది వెంటనే పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించి మొత్తం 172 మంది విద్యార్ధినులకు, 39 మంది బోధనా సిబ్బందికీ, బోధనేతర సిబ్బందికీ కరోనా పరీక్షలు చేశారు. వారిలో మరో 16 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కరోనా సోకినవారిలో 16 మంది విద్యార్ధినులు, ఇద్దరు జూనియర్ లెక్చరర్స్, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు. అయితే కరోనా సోకిన విద్యార్ధినులకు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించేబదులు ప్రిన్సిపల్ రమాదేవి వారందరినీ ఇళ్ళకు పంపించేయడం విస్మయం కలిగిస్తుంది. 


Related Post