భారత్‌లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

July 21, 2022
img

భారత్‌లో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుదవారం 5,07,360 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 21,566 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,881కి చేరింది. కరోనా పాజిటివిటీ రేటు 4.25 శాతానికి చేరుకొంది. గత 24 గంటలలో దేశంలో 45 మంది కరోనాతో మరణించారు. 

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 18,294 మంది కోలుకొన్నారు. దీంతో కరోనా రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత24 గంటలలో 29.12 లక్షల మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నందున బూస్టర్ డోసులు వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. 

తెలంగాణలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుదవారం 31, 625 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 640 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్‌ నగరంలో 277, రంగారెడ్డిలో 50, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. 

దేశంలో మంకీ పాక్స్ అనే కొత్త వైరస్ ప్రవేశించడంతో హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌ను నోడల్ హాస్పిటల్‌గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫీవర్ హాస్పిటల్‌లో మంకీ పాక్స్ రోగులకు అవసరమైన చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసి సిద్దంగా ఉంచారు. 

Related Post