భారత్‌లో మళ్ళీ కరోనా విజృంభణ...17,336 కేసులు!

June 24, 2022
img

భారత్‌లో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. బుదవారం సుమారు 13,000కి పైగా కేసులు నమోదు కాగా, గురువారం ఒకేసారి 4,000 కేసులు పెరిగి 17,336కి చేరుకొన్నాయి. కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కి పెరిగింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 13 మంది కరోనాతో మరణించారు. 

చాప కింద నీరులా దేశంలో మళ్ళీ కరోనా వ్యాపిస్తున్నా ప్రభుత్వాలు, ప్రజలు ఇంకా అప్రమత్తం కాకపోవడం వలన కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న కేసులలో ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. 

నిన్న నమోదైనవాటిలో మహారాష్ట్రలో 5,218 కేసులున్నాయి. ఆ తరువాత స్థానాలలో కేరళలో 3,890, ఢిల్లీలో 1,934, తమిళనాడులో 1,063, హర్యానాలో 872, కర్నాటకలో 858, తెలంగాణ రాష్ట్రంలో 494 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 

దీంతో పాజిటివిటీ రేటు మళ్ళీ ప్రమాదస్థాయికి చేరుకొంటోంది. ప్రస్తుతం 4.32 శాతం పాజిటివిటీ రేటు ఉంది. కానీ రికవరీ రేటు 98.59 శాతం ఉండటం చాలా ఊరట కలిగిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Related Post