ఇక అన్ని ప్రభుత్వాసుపత్రులలో ఉచితంగా మోకాలి చిప్పల ఆపరేషన్లు

May 03, 2022
img

తెలంగాణ రాష్ట్రంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారికి ఓ శుభవార్త. వివిద కారణాల చేత మోకాలి చెప్పలు అరిగిపోతుంటాయి. కాస్త డబ్బున్న వారైతే పర్వాలేదు కానీ మోకాలి చిప్పలు అరిగిపోయినా ఆపరేషన్ చేయించుకొనే స్థోమత లేని నిరుపేదలు దయనీయ జీవితాలు గడుపుతున్నారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ చేసుకొనేందుకు వెసులుబాటు కల్పించబోతోంది. 



ముందుగా సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ఈ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడంతో రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆపరేషన్ చేయించుకొన్న రోగులను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటివరకు హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో మాత్రమే ఈ మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్స్ చేస్తున్నారు. కానీ ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాసుపత్రులలో ఆపరేషన్లు అందుబాటులోకి తెస్తాము. ఎక్కడికక్కడ ప్రభుత్వాసుపత్రులలో ఈ ఆపరేషన్లు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. కనుక నిరుపేదలు అప్పులు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆపరేషన్లు చేయించుకోవద్దని మనవి చేస్తున్నాను,” అని హరీష్‌రావు చెప్పారు.

Related Post