మళ్ళీ కరోనా తెచ్చుకోవద్దు: డీహెచ్. శ్రీనివాస్

April 21, 2022
img

భారత్‌లో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. కోఠీలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు దాదాపు లేవనే చెప్పాలి. ప్రభుత్వం తీసుకొంటున్న అనేక చర్యల వలన ఒక్క హైదరాబాద్‌లో 10 కేసులు తప్ప రాష్ట్రంలో మరెక్కడా కొత్త కేసులు నమోదు కాలేదు. కానీ దేశంలో ఇతర రాష్ట్రాలలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ మాస్కులు ధరించడం వంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ మరోసారి కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము కనుక అందరూ జాగ్రత్తలు పాటించినట్లయితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకాలు, అర్హులైనవారు బూస్టర్ టీకాలు కూడా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ తప్పనిసరిగా మళ్ళీ మాస్కులు ధరించాలి,” అని అన్నారు.


Related Post