భారత్‌లో ఒక్కరోజే 3.47 లక్షల కరోనా కేసులు నమోదు

January 21, 2022
img

ఊహించినట్లే భారత్‌లో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 3,47,254 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. ముందురోజు కంటే 29,722 కేసులు అధికంగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,18,825 మంది (యాక్టివ్ కేసులు) ఆసుపత్రులలో లేదా హోమ్ క్వారెంటైన్‌లో ఉంటూ కరోనాకు చికిత్స తీసుకొంటున్నారని తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతం ఉందని తెలిపింది. దేశంలో గత 24 గంటలలో కొత్తగా 9,692 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కరోనాతో 703 మంది చనిపోయారు. అయితే కరోనా బారినపడి కొలుకొంటున్నవారి సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 2,51,777 మంది కరోనా నుంచి కోలుకొన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.  


Related Post