సంగారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్ధినులకు కరోనా

December 03, 2021
img

సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు మండలంలోని ముత్తంగి గురుకుల పాఠశాలలో మూడు రోజుల క్రితం 42 మంది విద్యార్దులు, ఒక ఉపాద్యాయురాలికి కరోనా సోకడంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలలో విద్యార్దులు, సిబ్బందికి వరుసగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

ఈ సందర్భంగా పటాన్ చెరు మండలంలోనే ఇంద్రేశం వద్ద గల మహాత్మా జ్యోతీబా ఫూలే గురుకుల పాఠశాలలో చదువుకొంటున్న 300 మంది విద్యార్ధినులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 27 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వారినందరినీ గురుకులంలోనే వేరే గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని జిల్లా వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. కరోనా సోకిన విద్యార్ధినులకు జలుబు, ఒళ్ళు నొప్పులు వంటి స్వల్ప అస్వస్థత లక్షణాలు తప్ప పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె తెలిపారు. 


Related Post