భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు

August 03, 2021
img

భారత్‌లో ఏడాదిన్నరగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి వేలాదిమంది ప్రాణాలు బలిగొంది. లక్షలాదిమంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. దాని వల్ల నష్టపోయినవారు నేటికీ ఇంకా తేరుకొనేలేదు. మళ్ళీ దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభమై అక్టోబర్ నాటికి కరోనా కేసులు పతాకస్థాయికి చేరుకొంటాయని నిపుణులు, సర్వేలు చెపుతున్నాయి. 

అటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా కరోనా జాగ్రత్తలు పాటించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుండటం, ఆంక్షలు సడలించడంతో పండుగలు, ఉత్సవాలు, ఎన్నికల ప్రచారాలు, మార్కెట్ల పేరుతో జనాలు భారీ సంఖ్యలో బహిరంగ ప్రదేశాలలో గుమిగూడుతుండటంతో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని హెచ్చరిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా చాలామంది రెండు డోసులు టీకాలు వేయించుకొన్నందున ఈసారి కరోనా తీవ్రత కాస్త తక్కువగానే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కానీ కరోనా కొత్త రూపం దాల్చి దాడి చేస్తే చాలా ప్రమాదామని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత వరకు కరోనా కట్టడికి గట్టి ప్రయత్నాలు చేయాలని, ఈసారి ముందుగానే ఆసుపత్రులు, కరోనా పరీక్షా కేంద్రాలు, అవసరమైన మందులు, ఆక్సిజన్‌ వగైరాలు సిద్దం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో 140 కోట్ల జనాభాలో కేవలం 7.6 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకొన్నారు. కనుక వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసులు మొదలైతే ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా న్ని ప్రభుత్వాసుపత్రులను సిద్దం చేస్తోంది.

Related Post