కరోనా చికిత్సకు మరో మందు 2డిజీ విడుదల

May 17, 2021
img

భారత రక్షణ సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ న్యూయార్క్‌లో క్లియర్ మెడిసిన్ అండ్ అలది సైన్సస్ (ఐఎన్ఎంఏఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థతో కలిసి కరోనా చికిత్సకు 2డీజీ(2-డియాక్సీ డి-గ్లూకోజ్‌) అనే ఓ ఔషదాన్ని తయారుచేసింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, డాక్టర్ హర్షవర్ధన్ కలిసి దానిని ఈరోజు ఢిల్లీలో విడుదల చేశారు. 

తొలి విడతగా 10,000 2డీజీ ప్యాకెట్లను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపర్తి డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు కేంద్రమంత్రులు అందజేశారు. కరోనాపై ఈ ఔషదం బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని వారు తెలిపారు. ఇది భారత్‌నే కాక యావత్ ప్రపంచదేశాలను కాపాడబోయే దివ్యౌషదమవుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. 

 పౌడర్ రూపంలో ఉండే ఈ ఔషదాన్ని వైద్యుల సూచనల మేరకు నీళ్ళలో కలుపుకొని త్రాగితే, అది శరీరంలోని కరోనా వైరస్ కణాలలోకి చేరి వాటిని వృద్ధి చెందకుండా సమర్ధంగా అడ్డుకొంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కరోనా లక్షణాలున్నవారు త్వరగా కోలుకొనేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. కరోనా చికిత్స ఇస్తున్న ఇతర మందులతో పాటు ఈ 2డీజీ మందును ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధిలో పెద్ద సమస్యగా మారిన రక్తంలోని ఆక్సిజన్‌ శాతం తగ్గిపోవడాన్ని ఇది నివారిస్తుందని కనుక కరోనా చికిత్సలో ఈ 2డీజీ మందు చాలా కీలకంగా మారనుందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.

Related Post