తెలంగాణలో వాక్సినేషన్‌కు మళ్ళీ బ్రేక్!

May 15, 2021
img

తెలంగాణలో కరోనా టీకాల ప్రక్రియకు మళ్ళీ బ్రేక్ పడింది. కొవీషీల్డ్ వాక్సిన్ డోసుల మద్య గడువు 4-6 వారాల నుంచి 12-16 వారాలకు మార్చుతూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, రెండో డోస్ టీకాలు వేయడాన్ని నేడు, రేపు, నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. మే 17 నుంచి మళ్ళీ టీకాలు వేయడం ప్రారంభిస్తామని తెలిపారు. 

రెండో డోస్ టీకాకు కేంద్రం 12 వారాల వ్యవధి నిర్ణయించినందున, ఇప్పటికే మొదటి డోస్ తీసుకొని 4-6 వారాలు పూర్తయినవారు అంతవరకు వేచి ఉండాల్సి ఉంటుంది. బహుశః ఆలోగా మొదటి డోస్ టీకాల కోసం ఎదురుచూస్తున్నవారికి టీకాలు వేయడం ప్రారంభించవచ్చు.

టీకాలు వేసే కార్యక్రమం ఇప్పటికే నత్తనడకలు నడుస్తుండగా ఇటువంటి నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను కేంద్రప్రభుత్వం మరింత అయోమయానికి గురి చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది.


Related Post