తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత... నిలిచిపోయిన వాక్సినేషన్

April 19, 2021
img

తెలంగాణలో కరోనా వాక్సిన్ల నిలువ అయిపోవడంతో ఆదివారం కరోనా వాక్సినేషన్ నిలిచిపోయింది. రాష్ట్రంలో వాక్సినేషన్ జోరుగా సాగుతుండటంతో వాక్సిన్ నిలువలు తగ్గిపోతున్నాయని కనుక ఎప్పటికప్పుడు తగినన్ని వాక్సిన్లు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే డిమాండ్‌కు తగ్గ వాక్సిన్లు ఉత్పత్తి చేయలేకపోతుండటంతో దేశంలో వాక్సిన్ల కొరత ఏర్పడుతోంది. ఆదివారం రాత్రిలోగా రాష్ట్రానికి కరోనా వాక్సిన్లు పంపిస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చిందని, అవి వస్తే సోమవారం నుంచి యధాప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ చేపడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదు కానీ ఇదే వేగంతో కరోనా కేసుల సంఖ్య పెరిగితే ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని కనుక దానిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ఊహించినడానికంటే చాలా తీవ్రంగా ఉన్నందున ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు.

Related Post