గాంధీ ఆసుపత్రిని మళ్ళీ కరోనా ఆసుపత్రిగా మార్పు

April 16, 2021
img

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని శనివారం నుంచి పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. రేపటి నుంచి ఓపీ, అత్యవసర కేసులతో సహా ఇతర సేవలన్నీ నిలిపివేయాలని, మళ్ళీ పూర్తిస్థాయిలో కరోనా రోగులకు చికిత్స అందజేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇతర రోగులను వేరే ఆసుపత్రులకు తరలించేందుకు ఆసుపత్రి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 450 మంది కరోనా రోగులు ఉండగా శుక్రవారం కొత్తగా మరో 150 మంది కరోనా రోగులు చేరినట్లు సమాచారం. హైదరాబాద్‌, చుట్టుపక్కల జిల్లాలలో ప్రతీరోజూ భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. 


Related Post