తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి కరోనా

April 06, 2021
img

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా కొన్ని గంటల ముందు సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యి రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిశారు. తనకు ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించనప్పటికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినందున తనను న కలిసినవారందరూ పరీక్షలు చేయించుకోవాలని సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 


Related Post